'వకీల్ సాబ్'కి పని మొదలెట్టిన తమన్!
Add ap7am to your home Screen

'వకీల్ సాబ్'కి పని మొదలెట్టిన తమన్!

Vakeel Sabs re recording work started
  • చాలా గ్యాప్ తర్వాత పవన్ చేస్తున్న చిత్రం 
  • మరో పదిరోజుల షూటింగు బ్యాలెన్స్ 
  • ఇప్పటికే జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు 
పవన్ కల్యాణ్ చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. కొన్నాళ్ల క్రితం ఒక్కసారిగా ఆయన రాజకీయాలలో బిజీ కావడంతో సినిమాలకి దూరమయ్యారు. ఇప్పుడు వీలుచూసుకుని మళ్లీ వరుసగా సినిమాలు చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలో ముందుగా ఒప్పుకున్న చిత్రం 'వకీల్ సాబ్'. హిందీలో వచ్చిన 'పింక్' హిట్ చిత్రానికి రీమేక్ గా ఇది రూపొందుతోంది. వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు.

ఇక లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరిగింది. మరో పది రోజులు జరిగితే కనుక షూటింగ్ మొత్తం పూర్తయ్యేది. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ రావడంతో షూటింగుకి బ్రేక్ పడింది. అయితే, ఇప్పటివరకు జరిగిన షూటింగుకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జరిగిపోతున్నాయి.

ఈ క్రమంలో ఈ రోజు నుంచి సంగీత దర్శకుడు తమన్ రీ రికార్డింగ్ పనిని కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. మిగిలివున్న షూటింగును ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. శ్రుతి హాసన్ ఇందులో ప్రత్యేక పాత్రను పోషిస్తోంది.    
Pawan Kalyan
Vakeel Saab
Shruti Hassan
Thaman

More Telugu News