Corona Virus: 12న మార్కెట్లోకి తొలి వ్యాక్సిన్... శుభవార్త చెప్పిన రష్యా, స్పందించిన యూఎస్!

Russia Corona Vaccine Will Out in 3 Days
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న వేళ, తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను మొట్టమొదటిసారిగా ఈ నెల 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేయడంపై అమెరికా స్పందించింది. ఈ వ్యాక్సిన్ ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న తరువాతనే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని యూఎస్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారైందని క్లయిమ్ చేసుకుని, దాన్ని పంపిణీ చేసే ముందు ఎటువంటి సమస్యలూ రాకుండా చూసేందుకు మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

కాగా, ఈ వ్యాక్సిన్ కు గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గత వారం రక్షణ శాఖ ప్రతినిధి గ్రిడ్నేవ్ మీడియాతో మాట్లాడుతూ, మెడికల్ సిబ్బందికి, వయో వృద్ధులకు తొలిసారి వ్యాక్సిన్ ఇస్తామని అన్నారు. వ్యాక్సిన్ సురక్షితను, పనితీరును 1,600 మందిపై పరిశీలించామని కూడా అన్నారు. గడచిన ఏప్రిల్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ సమయాన్ని కుదించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులను ఆదేశించగా, వైద్య నిపుణులు మూడు దశల పరీక్షలను శరవేగంగా పూర్తి చేశారు.

జూన్ 17న 76 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించారు. వీరిలో సగం మందికి ఇంజక్షన్ రూపంలో, మిగతావారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్ ను ఇచ్చామని అధికారులు తెలిపారు. రెండు రకాల పరీక్షల్లోనూ వ్యాక్సిన్ తీసుకున్న వారిపై సత్ఫలితాలను ఇచ్చిందని, అందరిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని 'స్పుత్నిక్' న్యూస్ వెల్లడించింది. ఎవరిలోనూ సైడ్ ఎఫెక్ట్స్  రాలేదని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసే పనులను సెప్టెంబర్ లో ప్రారంభించనున్నామని రష్యా పరిశ్రమల శాఖ మంత్రి డెనిస్ మన్తురోవ్ వ్యాఖ్యానించారు.

Go Back to Shorts
Corona Virus
Vaccine
Russia
USA

More Telugu News