KCR: నేటి నుంచే సాగర్‌ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటి విడుదల: కేసీఆర్ కీలక‌ నిర్ణయం

kcr takes decision on sagar water
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారని తెలంగాణ సీఎంవో ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ రోజు నుంచే నీటి విడుదల ప్రారంభం కావాలని నాగార్జున సాగర్ సీఈని ఆదేశించారని వివరించింది.

'కృష్ణానది ఎగువన నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నందున, ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న సాగర్‌ ఆయకట్టు రైతులకు ఈ వానాకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు' అని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.
Go Back to Shorts
KCR
TRS
Telangana

More Telugu News