ఏపీలో రెండు లక్షలకు చేరువైన కరోనా కేసులు

Corona positive cases nears two lakhs in AP
  • కొత్తగా 10,328 పాజిటివ్ కేసులు
  • 1,96,789కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • గత 24 గంటల్లో 8,516 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత మళ్లీ అధికమైంది. కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుతున్న సూచనలు కనిపించినా, కొత్త కేసుల సంఖ్య మళ్లీ 10 వేలు దాటుతోంది. గడచిన 24 గంటల్లో 10,328 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి (1,351), కర్నూలు (1,285), అనంతపురం (1,112) జిల్లాల్లో పాజిటివ్ కేసులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,96,789కి చేరింది. అటు మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగించే రీతిలో ఉంది. తాజాగా 72 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,753కి పెరిగింది. కొత్తగా 8,516 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 82,166 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Andhra Pradesh
Deaths
COVID-19

More Telugu News