JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు కోర్టులో ఊరట!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు అనంతపురం కోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. తాడిపత్రిని వదిలి ఎక్కడకూ వెళ్లకూడదని షరతు పెట్టింది. ట్రాన్స్ పోర్ట్ స్కాంలో జూన్ 13న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో వీరిద్దరూ ఉన్నారు. బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలుకు చేరితే, రేపు వీరు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ వీరిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఇటీవలే కొట్టేసింది.
JC Prabhakar Reddy
Asmith Reddy
Bail
Telugudesam

More Telugu News