కృతి సనన్ కి బాలీవుడ్ లో భారీ ఆఫర్!
- తెలుగులో రెండు సినిమాలు చేసిన కృతి
- బాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ బిజీ
- హృతిక్ రోషన్ కి జంటగా క్రిష్ 4లో ఛాన్స్
హృతిక్ రోషన్ హీరోగా రూపొందే 'క్రిష్ 4' చిత్రంలో కథానాయికగా నటించే చాన్స్ కృతికి తాజాగా వచ్చినట్టు సమాచారం. మొదట్లో ఈ పాత్ర కోసం కత్రినా కైఫ్, అలియా భట్ వంటి టాప్ స్టార్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, కృతి సనన్ తో ఒప్పందం ఖరారైంది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక కృతి రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.
క్రిష్ సీరీస్ అనగానే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ వుంది. గతంలో ఈ సీరీస్ లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడీ క్రిష్ 4లో హృతిక్ ఏకంగా నాలుగు పాత్రలు పోషించనున్నట్టు చెబుతున్నారు. దర్శకుడు రాకేశ్ రోషన్ ఇప్పటికే స్క్రిప్టు పని పూర్తిచేస్తున్నారట.