ఏపీ కరోనా అప్ డేట్స్: 24 గంటల్లో 63 మరణాలు, 7,822 కొత్త కేసులు

Corona cases increased rapidly in Andhra Pradesh
  • రాష్ట్రంలో 1,537కి చేరిన కరోనా మరణాలు
  • తాజాగా 5,786 మంది డిశ్చార్జి
  • ఇంకా 76,377 మందికి చికిత్స
ఏపీలో కరోనా వైరస్ భూతం స్వైరవిహారం చేస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 7,822 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,586కి చేరింది. ఈ రోజు తూర్పు గోదావరి (1,113), విశాఖపట్నం (1,049) జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. అటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 63 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది కన్నుమూశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,537కి చేరింది. కొత్తగా 5,786 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 88,672 కాగా, ప్రస్తుతం 76,377 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths
COVID-19

More Telugu News