ఇకపై భూసేకరణలు చేపడితే ఏం నమ్మి ప్రజలు భూములిస్తారు?: నాగబాబు
- జనసేన నేతల టెలీకాన్ఫరెన్స్
- హాజరైన నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట
- జనసేన ఒకే విధానంతో ఉందన్న నాగబాబు
- రాజధాని నిర్ణయం వ్యక్తిగత అజెండాతో తీసుకున్నారన్న నాదెండ్ల
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాజధాని తరలింపు నిర్ణయం వ్యక్తిగత అజెండాతో తీసుకున్న నిర్ణయం అని విమర్శించారు. రాజధానిలో అవినీతి జరిగిందని చెబుతున్న వైసీపీ, విచారణ జరిపి స్కాంలకు పాల్పడిందెవరో వెలికితీసి వారిని శిక్షించాలి కదా! అని అన్నారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటానికి సమయం ఆసన్నమైందని జనసేన నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు.