Junior NTR: ఎన్టీఆర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. జాన్వీకి ఛాన్స్?

Jhanvi Kapoor to pair with Junior NTR
షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇందులో తారక్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని చెపుతున్నారు.

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే, రష్మిక, సమంత ఈ ముగ్గురిలో ఒకర్ని ఎంపిక చేయనున్నారని సమాచారం. మరో హీరోయిన్ గా దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ పేరు వినిపిస్తోంది. జాన్వీని ఇప్పటికే ఎంపిక చేశారని కూడా ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Junior NTR
Trivikram Srinivas
Samantha
Rashmika Mandanna
Jhanvi Kapoor
Pooja Hegde

More Telugu News