YSRCP: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొప్పన మోహనరావు కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు (75) కన్నుమూశారు. తూర్పుగోదావరికి చెందిన ఆయన 1978, 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. ఇటీవల వైసీపీలో చేరి పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈమధ్య ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు వైసీపీ నేతలు సంతాపం తెలిపారు.
YSRCP
East Godavari District
koppana mohana rao
dead

More Telugu News