చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా.. మూడు నెలల తర్వాత ఒకే రోజు వంద కేసులు
- ఏప్రిల్ 13 తర్వాత వందకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి
- 89 కేసులు ఒక్క షిన్‌జింగ్‌లోనే..
- కరోనాతో చైనాలో ఇప్పటి వరకు 4,634 మంది మృతి
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న చైనా.. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తోంది. రాజధాని బీజింగ్‌లో ఇప్పటి వరకు దాదాపు 10 లక్షలు, డాలియన్, ఝావోలైన్ నగరాల్లో దాదాపు 30 లక్షల పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కాగా, చైనాలో ఇప్పటి వరకు 84,060 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు.