రెండు రోజుల్లో రూ.1500 పెరిగిన బంగారం ధర
- 10 గ్రాముల పసిడి ధర రూ.52,301
- నిన్న రాత్రి రూ.1066 లాభంతో రూ.52,101 వద్ద స్థిరపడిన ధర
- ఈ రోజు ఉదయం ఇప్పటికే రూ.200ల పెరుగుదల
- గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 2000 డాలర్లు
కరోనా కేసుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర 2000 డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ 2 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని అంటున్నారు. మరోవైపు, సమీప భవిష్యత్తులో పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో పసిడి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.