వైట్ హౌస్ లో కరోనా కలకలం... ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుకు పాజిటివ్
- కరోనా బారినపడిన రాబర్ట్ ఓబ్రియన్
- ఇటీవలే పారిస్ వెళ్లొచ్చిన ఓబ్రియన్
- ట్రంప్ కు ఎలాంటి ముప్పు లేదన్న వైట్ హౌస్
అమెరికా పాలన వ్యవహారాల్లోనూ, విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషించే రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెలలో పారిస్ వెళ్లి ఓ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయనకు ఎక్కడ కరోనా సోకిందన్న దానిపై స్పష్టతలేదు. జాతీయ భద్రతా సలహదారుకు కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు కరోనా ముప్పు లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.