కరోనా వాహకాలుగా పనిచేసి వైరస్ ను వ్యాపింపచేయండి... భారత్ ముస్లింలకు పిలుపునిచ్చిన ఐసిస్

ISIS calls muslims to spread corona virus
  • ఐసిస్ దుష్టపన్నాగం
  • అవిశ్వాసులను అంతం చేయాలని భారత ముస్లింలకు పిలుపు
  • ఆయుధాలు దగ్గర ఉంచుకోవాలని సూచన
కొన్నాళ్ల కిందట వరకు ప్రపంచంలోని అనేకదేశాల్లో నెత్తుటి ఏళ్లు పారించిన ఐసిస్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ తన దుష్ట బుద్ధిని విడనాడలేదు. ఇటీవల అమెరికా దాడుల్లో అగ్ర కమాండర్లు మరణించినా ఐసిస్ తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా తన అధికారిక మ్యాగజైన్ వాయిస్ ఆఫ్ హింద్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్ లోని ముస్లింలు కరోనా వైరస్ వాహకాలుగా పనిచేసి దేశంలోని అత్యధికులకు కరోనా వైరస్ వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చింది. ఈ కరోనా విపత్తును ఉపయోగించుకుని భారత్ ను దెబ్బతీయాలని సూచించింది. అవిశ్వాసులను అంతం చేయండి అంటూ భారత్ లోని ముస్లింలకు ఉద్బోధించింది.

ఇక ఆ మ్యాగజైన్లో ముస్లిం వ్యతిరేకులను ఎలా చంపాలో కూడా ఐసిస్ వివరించింది. "మీ వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉండేలా చూసుకోండి. ఇస్లాం వ్యతిరేకిని చంపేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా జారవిడుచుకోకండి. చైన్లు, తాళ్లు, వైర్లు.. ఇలాంటివి కూడా ఆయుధాలుగా ఉపయోగించండి. గ్లాసు వంటి పదునైన వస్తువులు ఉంటే చంపడం మరింత సులువు. మత విరుద్ధ వాదిని చంపేందుకు కత్తెర, సుత్తి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి" అని పేర్కొంది.
Go Back to Shorts
ISIS
Corona Virus
Carriers
Spread

More Telugu News