Allu Arjun: ఎనిమిది కిలోల బ‌రువు త‌గ్గిన అల్లు అర్జున్!

allu arjun tries for new look
షార్ట్స్‌లో చూడండి
'అల వైకుంఠపురంలో' సినిమాతో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. కరోనా నేపథ్యంలో ఈ షూటింగ్‌ వాయిదా పడగా, వైరస్ ప్రభావం తగ్గగానే తిరిగి షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ సినిమా కోసం బన్నీ కొత్త గెటప్‌లో కనపడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. స్టైలిష్ స్టార్‌ లుక్‌ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో పుష్ప‌రాజ్‌ పాత్రలో కనపడనున్న బ‌న్నీ ఆ పాత్ర కోసం ఇప్ప‌టికే ఎనిమిది కిలోల బ‌రువు త‌గ్గార‌ట.

బరువు తగ్గడం కోసం బన్నీ ఇటీవల కేబీఆర్‌ పార్కులో తన ఇంటి వద్ద రన్నింగ్‌ చేస్తూ కనపడ్డ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాను శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తీస్తున్నారు.
Go Back to Shorts
Allu Arjun
Tollywood
sukumar

More Telugu News