చిత్తూరులో కొవిడ్‌కు చికిత్స పొందుతూ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన బాధితుడు
- జిల్లా క్షయ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
- జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో నిన్న పరీక్షల నిర్వహణ
- అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగి హాజరు
ఇక్కడ సమావేశ మందిరంలో నిన్న నిర్వహించిన పరీక్షలకు చికిత్స పొందుతున్న బాధితుడు కూడా హాజరు కావడం కలకలం రేపింది. విషయం కాస్తా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశం కావడంతో జిల్లా క్షయ నివారణ విభాగం అధికారి రమేశ్ బాబు స్పందించారు. నిన్న ఉదయం బాధితుడికి నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో ఫలితం నెగటివ్ అని రావడంతో డీఎంహెచ్ఓ అనుమతితోనే అతడిని పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చినట్టు వివరించారు.