రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ... కొత్తమంత్రులతో ప్రమాణస్వీకారం
- మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
- మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో కొత్త మంత్రులు
- ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి, సుభాష్ చంద్రబోస్
ఇప్పటివరకు మంత్రిగా ఉన్న మోపిదేవి, డిప్యూటీ సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికైనందున వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరిస్థానంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రి పదవులు చేపడతారని తెలుస్తోంది. అటు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.