కొన్ని సినిమాల నుంచి తనను రాత్రికి రాత్రి తీసేశారంటున్న సాహో నటి

  • సాహో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎవ్లీన్ శర్మ
  • కొందరి సన్నిహితుల కోసం తనను తీసేశారని వెల్లడి
  • బాలీవుడ్ లో డబ్బు, అధికారం రాజ్యమేలుతాయి 
సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ భామ ఎవ్లీన్ శర్మ బంధుప్రీతి (నెపోటిజం) అంశంపై మాట్లాడింది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం అంశం ఎక్కువగా చర్చకు వస్తోంది. దీనిపై ఎవ్లీన్ స్పందిస్తూ, కొన్ని సినిమాల నుంచి తనను రాత్రికి రాత్రే తొలగించారని, కొందరికి బాగా కావాల్సిన వాళ్ల కోసమే తనను తీసేశారని తెలిసి ఎంతో బాధపడ్డానని వివరించింది.

కొన్ని సినిమాలు వచ్చినా వాటిలో తన ప్రతిభ చూపేందుకు అవకాశం రాలేదని, కొన్ని భయానక అనుభవాలుగా మిగిలిపోయాయని పేర్కొంది. అయితే ఇలాంటి అనుభవాలతో తాను మరింత రాటుదేలిపోయానని తెలిపింది. బాలీవుడ్ లో డబ్బు, అధికారం రాజ్యమేలుతాయని, కానీ వాటిని పట్టించుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్టు ఎవ్లీన్ వెల్లడించింది.


More Telugu News