ఏపీలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. కేంద్రానికి తెలిపిన ప్రభుత్వం
- ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
- బడుల సురక్షిత ప్రణాళికపై వివరాలు కోరిన కేంద్రం
- ఎలాంటి నిర్ణయం తీసుకోని తమిళనాడు, తెలంగాణ
పాఠశాలల సురక్షిత ప్రణాళికపై ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. పాఠశాలలను తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పాలని ఈ సందర్భంగా కోరింది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ ప్రణాళికలను వివరించగా, వీటిలో ఏవైనా మార్పులు ఉంటే చెప్పాలంటూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. నిజానికి ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని తొలుత కేంద్రానికి తెలిపిన రాష్ట్రం ఇప్పుడు సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించనున్నట్టు తెలిపింది.