ఏపీలో కరోనా మహోగ్రరూపం... ఒక్కరోజే 52 మరణాలు, 3,963 పాజిటివ్ కేసులు
- తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బీభత్సం
- జిల్లాలో 12 మంది మృతి, 994 కొత్త కేసులు
- తాజాగా రాష్ట్రంలో 1,411 మంది డిశ్చార్జి
ఇక, కొత్తగా 3,963 మందికి పాజిటివ్ అని తేలింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 994 మందికి పాజిటివ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో 550, పశ్చిమ గోదావరి జిల్లాలో 407 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,609కి చేరింది. తాజాగా 1,411 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 22,260 మంది చికిత్స పొందుతున్నారు.