లాక్ డౌన్ లో కాజల్ భక్తి మార్గం!
- కొన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్న సినిమా తారలు
- కుటుంబ సభ్యుల మధ్య గడుపుతున్న కాజల్
- భగవద్గీత, భాగవతం కథలు వింటున్న ముద్దుగుమ్మ
ఈ నేపథ్యంలో అందాలతార కాజల్ కూడా ముంబైలో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య హ్యాపీగా గడుపుతోందట. పైపెచ్చు, ఈ ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకున్నానని చెబుతోంది. ముఖ్యంగా భగవద్గీత, భాగవతం కథలు శ్రద్ధగా విందట. దీని గురించి ఈ ముద్దుగుమ్మ చెబుతూ, "అవును, లాక్ డౌన్ సమయంలో భగవద్గీత, శ్రీమద్ భాగవతం విన్నాను. ఈ పురాణ కథలు నన్నెప్పుడూ ఎంతగానో ఆకర్షిస్తాయి. నన్నలా కట్టిపారేస్తాయి. విలువైన పాఠాలను అర్థం చేసుకునే సమయాన్ని దక్కించుకున్నాను' అని చెప్పింది కాజల్.