ఓ పార్టీ ఎమ్మెల్యేలను అమ్ముకుంటుంటే.. మరో పార్టీ కొంటోంది: 'ఆప్' నేత
- కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉంది.. అది బతకడం కష్టమే
- రాజస్థాన్ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు
- ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలా?
రాజస్థాన్‌లో ఏం జరుగుతోందో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని రాఘవ్ చద్దా అన్నారు. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, ప్రస్తుతం ఆ పార్టీ వెంటిలేటర్‌పై ఉందన్నారు. అది బతికి బట్టకట్టడం అసాధ్యమని తేల్చి చెప్పారు. తనకే భవిష్యత్ లేని ఆ పార్టీ దేశానికి ఇంకేమి చేస్తుందని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే దేశానికి ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు.