తెలంగాణ సచివాలయ కూల్చివేతపై రేపటి వరకు స్టే పొడిగింపు
- కూల్చివేతకు ముందు పర్యావరణ అనుమతులు లేవన్న పిటిషనర్
- కూల్చివేతకు అవసరం లేదన్న అడ్వకేట్ జనరల్
- ఖండించిన హై కోర్టు ధర్మాసనం
అయితే, ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని, కూల్చివేయడమంటే నిర్మాణానికి తిరిగి భూమిని సిద్ధం చేయడమేనని కోర్టు పేర్కొంది. స్పందించిన ఏజీ.. నిర్మాణ సమయంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. దీంతో పర్యావరణ అనుమతిపై కేంద్రం రేపు వివరణ ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చే తీర్పులుంటే సమర్పించాలని ఆదేశించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.