మళ్లీ లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉండదు!: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను కట్టడి చేయొచ్చు
- కరోనా వచ్చి, పోతుంటుంది
- కేసీఆర్ కనపడకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయా?
కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ కనపడకుండా పోయారని, ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని టీపీసీసీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై తలసాని మండిపడ్డారు. కేసీఆర్ కనపడకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయా? అని ప్రశ్నించారు. నిన్న వ్యవసాయ అధికారులతో కేసీఆర్ ఫోనులో మాట్లాడారని ఆయన తెలిపారు.
బీజేపీ నేతలు కూడా కరోనాపై బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వారికి చేతనైతే ప్రధాని మోదీతో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని సవాలు విసిరారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను చప్పట్లు కొట్టాలని, దీపాలు వెలిగించాలని చేసిన వ్యాఖ్యలపై తాము ప్రశ్నించలేదు కదా? అని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయని ఆయన చెప్పారు.