కరోనా దోపిడీ.. ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
- ప్రభుత్వ జీవోను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు
- నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు
- 14వ తేదీ లోపల వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశం
ఎంత చార్జీలను వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ... ఆసుపత్రులు పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయంపై 14వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.