దేశంలో పెరిగిన నిరుద్యోగం.. ఏప్రిల్‌లో ఉద్యోగాలు కోల్పోయిన 17.7 మిలియ‌న్ల మంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో పెరిగిన నిరుద్యోగం.. ఏప్రిల్‌లో ఉద్యోగాలు కోల్పోయిన 17.7 మిలియ‌న్ల మంది

joblessness statistics in india
  • క‌రోనా విజృంభణ వల్ల సమస్యలు
  • ఉద్యోగాలు కోల్పోయి గత నెల‌లో మళ్లీ చేరిన 3.9 మిలియ‌న్ల మంది
  • అయినప్పటికీ‌ ప‌ట్ట‌ణాల్లో నిరుద్యోగుల సంఖ్య‌ 11.26 శాతం
  • ఉద్యోగ భ‌ద్ర‌త‌పై ఆందోళన
క‌రోనా విజృంభణ వల్ల వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు తగ్గిపోవడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వ్యవసాయం, స్వయం ఉపాధి పనులు దొరుకుతుండడంతో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

ఇదే విషయాన్ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ(సీఎంఐఈ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 17.7 మిలియ‌న్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. లాక్‌డౌన్‌ సడలింపులతో మళ్లీ పలు సంస్థలు తెరుచుకోవడంతో గత నెల‌లో 3.9 మిలియ‌న్ల మంది తిరిగి ఉద్యోగాల్లో చేరారని చెప్పింది. కరోనా విజృంభణ వల్ల విధించిన లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చినప్పటికీ‌ ప‌ట్ట‌ణాల్లో నిరుద్యోగుల సంఖ్య‌ 11.26 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
 
దేశంలో నాలుగు వారాల క్రితం నిరుద్యోగ రేటు 10.69 శాతంగా ఉండగా ఇప్పుడు ఇది 11.26 శాతానికి చేరింది. ముఖ్యంగా దేశంలోని క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌హారాష్ట్ర, అసోం రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. లాక్‌డౌన్‌ విధింపు వ‌ల్ల దేశంలో కూలీల కొర‌త ఏర్పడిందని, ఈ పరిస్థితి చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భావం చూపుతుందని చెప్పింది. దీంతో  ఉద్యోగ భ‌ద్ర‌త‌ అంశం దిగజారుతోందని తెలిపింది.
job
India
Corona Virus
Lockdown

More Telugu News