Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల వెల్లువ... కొత్తగా 1590 మందికి పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. తాజాగా 1590 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,902కి పెరిగింది. రాష్ట్రంలో మరో ఏడుగురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 295కి పెరిగింది. కాస్త ఊరటనిచ్చేలా ఇవాళ 1,166 మంది డిశ్చార్జి అయ్యారు. దాంతో మొత్తం 12,703 మంది కోలుకున్నట్టయింది.

ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య 10,703 అని బులెటిన్ లో పేర్కొన్నారు. ఎప్పట్లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా పాజిటివ్ కేసులు వచ్చాయి. హైదరాబాద్, పరిసరాల్లో గడచిన 24 గంటల్లో 1,277 మందికి కరోనా నిర్ధారణ అయింది. మేడ్చెల్ జిల్లాలో 125 మందికి, రంగారెడ్డి జిల్లాలో 82 మందికి కరోనా సోకింది.
Corona Virus
Telangana
Positive
Hyderabad
GHMC
COVID-19

More Telugu News