Venkatesh: విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా నుంచి మరో పోస్ట‌ర్ విడుద‌ల‌.. సైకిల్‌పై కార్తీక్‌ రత్నం

narappa poster releases
షార్ట్స్‌లో చూడండి
విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న నారప్ప సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్‌ ఖాతాలో విడుద‌ల చేసింది. ఈ సినిమాలో ఈ పాత్ర‌లో కార్తీక్ ర‌త్నం న‌టిస్తున్నాడు.

ఈ రోజు ఆయ‌న పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నట్లు సురేశ్ ప్రొడక్షన్స్‌ తెలిపింది. సైకిల్‌పై కార్తీక్‌ రత్నం వెళ్తున్నట్లు ఉన్న ఈ పోస్ట‌ర్ అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా, శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో నార‌ప్ప సినిమా రూపుద్దికుంటోంది.

తమిళ చిత్రం ‘అసురన్‌' ఆధారంగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వవీ క్రియేషన్స్‌ పతాకాలపై ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ మధ్యవయస్కుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సినిమాలోని లుక్‌లు చిత్రంపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.

Go Back to Shorts
Venkatesh
Tollywood
naarappa

More Telugu News