తెలంగాణలో ఒక్కరోజే 1,213 కరోనా కేసులు... ఇప్పటివరకు ఇదే రికార్డు

Telangana witnesses record corona cases
  • జీహెచ్ఎంసీ పరిధిలో 998 కొత్త కేసులు
  • నేడు 987 మంది డిశ్చార్జి
  • రాష్ట్రంలో మరో 8 కరోనా మరణాలు
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. ఇవాళ రికార్డు స్థాయిలో 1,213 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 998 కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి పెరిగింది.

ఇక, తాజాగా 987 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 9,069కి చేరింది. ప్రస్తుతం 9,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో మరో 8 మంది మృతి చెందగా, కరోనా మరణాల సంఖ్య 275గా నమోదైంది.
Go Back to Shorts
Corona Virus
Telangana
Record
Positive Cases
GHMC
Hyderabad

More Telugu News