రేపు ఢిల్లీ వెళుతున్న వైసీపీ ఎంపీలు... రఘురామకృష్ణరాజు అంశంపై స్పీకర్ తో సమావేశం
- పార్టీకి, రఘురామకృష్ణరాజుకు మధ్య యుద్ధం
- ఇప్పటికే రఘురామకృష్ణరాజుకు షోకాజ్ నోటీసులు
- నోటీసులపై తీవ్రంగా స్పందించిన నరసాపురం ఎంపీ
సంజాయిషీ ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసులనే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణరాజు మరింత ఆజ్యం పోశారు. వైసీపీ హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన నరసాపురం ఎంపీ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. రేపు వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్ ను కలవనుండడంతో ఈ అంశంలో మరింత ఆసక్తి ఏర్పడింది.