VH: 15 రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వీహెచ్

VH discharged from hospital
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఆయన భార్య హైదరాబాదులోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు 15 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. దీంతో వారిని  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా నుంచి కోలుకోవడంతో వీహెచ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ సందర్భంగా ఆయన... థ్యాంక్ గాడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బండ్ల గణేశ్ కూడా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
VH
congress
Corona Virus

More Telugu News