నిషేధంపై స్పందించిన టిక్ టాక్ ఇండియా యాజమాన్యం!

Tiktok India Head Comment on Ban
  • నిబంధనలన్నీ పాటిస్తున్నాం
  • చైనా సహా ఏ ప్రభుత్వానికీ సమాచారం ఇవ్వలేదు
  • టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ
టిక్ టాక్ తో పాటు మరో 58 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో టిక్ టాక్ ఇండియా స్పందించింది. తాము ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరుగలేదని స్పష్టం చేసింది. "భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. భారత యూజర్లకు చెందిన సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోలేదు" అని టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని, తమ అభ్యంతరాలను తెలియజేస్తామని, ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేస్తామని ఆయన అన్నారు.
Go Back to Shorts
TikTok
Nikhil Gandhi
Ban

More Telugu News