కొండపోచమ్మ జలాశయానికి గండి.. నీట మునిగిన పొలాలు

Kondapochamma sagar reservoir right canal breaks down
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు ఈ ఉదయం గండిపడింది. జలాశయం నుంచి బయటపడిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. కాగా, ఇటీవలే ఈ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీటిని విడుదల చేశారు. ఉదయం పూట ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Siddipet District
kondapochamma sagar reservoir
Water
Telangana Jana Samithi

More Telugu News