కారు పక్కనే కనిపించిన పామును స్వయంగా పట్టుకున్న హైదరాబాద్ సీపీ
- వాకింగుకి వెళ్లిన సీపీ అంజనీ కుమార్
- పామును చూసి అరిచిన పెంపుడు కుక్క
- పామును పట్టి నెహ్రూ జూ పార్క్ కు తరలించిన సీపీ
దేన్ని చూసి కుక్క అరుస్తోందని ఆయన అన్ని వైపులా పరిశీలించగా, అక్కడ ఓ పాము కనిపించింది. వెంటనే తన సిబ్బంది సాయంతో అంజనీ కుమార్ స్వయంగా ఆ పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని నెహ్రూ జూ పార్క్ సిబ్బందికి అప్పగించారు. పాములు కనిపించినప్పుడు తొందరపాటుతో వాటిని చంపరాదని, పాములు సైతం పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తుంటాయని అంజనీ కుమార్ వివరించారు. తమ పోలీసు విభాగంలో కూడా కొందరికి పాములు పట్టడంలో శిక్షణ ఇప్పించామని తెలిపారు.