తెలుగు బుల్లితెర రంగంలో కరోనా అలజడి... మరో నటుడికి పాజిటివ్
- గృహలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా
- ఇప్పటికే ప్రభాకర్ కు పాజిటివ్
- ఇటీవలే ప్రభాకర్ ను కలిసిన హరికృష్ణ
తాజాగా హరికృష్ణ అనే మరో తెలుగు సీరియల్ నటుడికి కూడా కరోనా నిర్ధారణ అయింది. హరికృష్ణ ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్ లో నటిస్తున్నాడు. కీలక నటుడికి కరోనా అని తేలడంతో గృహలక్ష్మి ఎపిసోడ్ షూటింగ్ నిలిపివేశారు. ఇటీవల కరోనా పాజిటివ్ గా వచ్చిన ప్రభాకర్ ను హరికృష్ణ కలిసినట్టు గుర్తించారు. ప్రభాకర్ ను కలిసిన 33 మందికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక రాకముందే షూటింగులు మొదలుపెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.