సుప్రీంకోర్టు అనుమతి.. కదలనున్న పూరీ జగన్నాథుడి రథ చక్రాలు!

Supreme Court gives green signal to Puru Rath Yatra
  • పూరీ రథయాత్రకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
  • భక్తులు లేకుండా నిర్వహించాలంటూ ఆదేశం
  • కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే పూరీ జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రథయాత్రకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ యాత్రలో భక్తులు పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రథయాత్ర నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం తరుపు న్యాయవాది హరీశ్ సాల్వే వాదిస్తూ... రథయాత్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో రేపటి నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Puri Rathayatra
Supreme Court

More Telugu News