ఆన్ లైన్లో పాఠాలు చెప్పమంటే అసభ్య సందేశాలు పంపారు... కీచక టీచర్ల అరెస్ట్
- లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ బోధన
- విద్యార్థిని ప్రశ్నలు అడిగితే అసభ్యకరంగా జవాబులు పంపిన టీచర్లు
- టీచర్లను రిమాండ్ కు తరలించిన పోలీసులు
షాబాద్ కు చెందిన శ్రీకాంత్, సురేందర్ అనే టీచర్లు వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. ఓ 9వ తరగతి విద్యార్థిని అడిగిన ప్రశ్నలకు సవ్యరీతిలో సమాధానాలు చెప్పాల్సిందిపోయి, జుగుప్సాకర రీతిలో అసభ్య సమాధానాలు పంపారు. దాంతో ఆ విద్యార్థిని షీటీమ్ ను ఆశ్రయించింది. ఆ ఇద్దరు టీచర్ల అరాచకంపై వెంటనే స్పందించిన సైబరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు తెలిపారు.