ఇంట్లో పబ్జీ.. అసెంబ్లీలో లాలిజో..!: సీఎం జగన్ పై నారా లోకేశ్ వ్యంగ్యం

Nara Lokesh tweets about CM Jagan
  • సీఎం జగన్ అసెంబ్లీలో నిద్రపోతున్న దృశ్యాలతో వీడియో
  • గత సమావేశాల్లోనూ ఇలాగే నిద్రించాడని వీడియో ద్వారా వెల్లడి
  • ఆసక్తికర ట్వీట్ చేసిన నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం జగన్ ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిద్రపోతూ కనిపించిన దృశ్యాలతో వీడియోను పంచుకున్నారు. గత సమావేశాల్లోనూ ఇలాగే నిద్రపోయాడని, ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడనే అర్థం వచ్చేలా 'జగన్ అనే నేను అసెంబ్లీలో...' అనే శీర్షికతో వీడియో రూపొందించారు. "ఇంట్లో పబ్జీ... అసెంబ్లీలో లాలిజో" అంటూ లోకేశ్ సెటైర్ వేశారు.

Go Back to Shorts
Nara Lokesh
Jagan
Sleeping
Assembly
Andhra Pradesh

More Telugu News