పింఛను కోసం.. తల్లిని మంచంపై పడుకోబెట్టి బ్యాంకు వరకు లాక్కెళ్లిన కూతురు.. వీడియో ఇదిగో
- ఒడిశాలోని నౌపాడా జిల్లాలో ఘటన
- తల్లిని కూడా తీసుకురావాలన్న బ్యాంకు సిబ్బంది
- చేసేది లేక మంచంపై తీసుకెళ్లిన కూతురు
ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీనిపై స్పందించిన నౌపాడా ఎమ్మెల్యే రాజు ధోలాకియా ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ... 'ఈ విషయం మా దృష్టికి వచ్చింది. తన తల్లి పింఛను డబ్బుల కోసం ఆమె ఇలా చేయాల్సి వచ్చింది. ఈ విషయంపై స్పందించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అన్నారు.