బాలీవుడ్ వైపు మళ్లిన వార్నర్... ఈసారి అక్షయ్ కుమార్ పాటకు స్టెప్పులు
- లాక్ డౌన్ రోజుల్లో వార్నర్ డ్యాన్స్ హంగామా
- వరుసగా టిక్ టాక్ వీడియోలతో సందడి
- తెలుగు హిట్ సాంగ్స్ తో అభిమానులను అలరించిన వార్నర్
ఆస్ట్రేలియాలో ఆర్నెల్ల పాటు లాక్ డౌన్ విధించడంతో ఇప్పట్లో క్రికెట్ కార్యకలాపాలు మొదలయ్యే వీల్లేని పరిస్థితుల్లో.... వార్నర్ వరుసగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ అభిమానులను తరచుగా అలరిస్తున్నాడు. ముఖ్యంగా, మహేశ్ బాబు, అల్లు అర్జున్ పాటలకు డ్యాన్స్ చేయడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.