సినీ కార్మికులకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి: చిరంజీవి
- లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన సినీ వర్కర్లు
- సాయం చేసేందుకు సీసీసీ ఏర్పాటు
- నాణ్యతలో రాజీపడడంలేదన్న చిరంజీవి
సినీ పరిశ్రమలో దినసరి వేతనాలపై పనిచేస్తున్న వర్కర్లకు వారి ఇంటి వద్దకే సాయం అందజేస్తున్నామని, ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో ప్యాక్ చేసిన సరుకులనే ఇస్తున్నామని వివరించారు. నాణ్యతలో రాజీపడకుండా, ఎంతోమంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని వారిందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చిరంజీవి ట్వీట్ చేశారు.