అర్ధరాత్రి నుంచి అంతుచిక్కని వాసన... అదేంటో అర్థంకాక ముంబయి వాసుల్లో భయాందోళనలు
- ముంబయి మహానగరంలో ఘాటు వాసనలు
- మూలం ఏమిటో గుర్తించలేకపోయిన అధికారులు
- గత సంవత్సరం కూడా ఇదే తరహాలో వాసనలు
దాంతో అధికారులు గ్యాస్ లీక్ గా భావించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. వారికి తోడు 17 ఫైరింజన్లు కూడా ఈ వాసన ఎక్కడ్నించి వస్తుందో కనిపెట్టేందుకు విఫలయత్నం చేశాయి. అంతేకాదు, ప్రమాదకర రసాయన పదార్థాలను గుర్తించే హజ్మత్ వాహనాన్ని కూడా తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. సమీపంలోని రసాయన పరిశ్రమలు, చమురు కంపెనీలను పరిశీలించినా అసలు ఆ వాసన ఎక్కడ్నించి వస్తున్నదో కూడా గుర్తించలేకపోయారు. అయితే, ఇది గ్యాస్ లీక్ వాసన అయ్యుండదని భావిస్తున్న అధికారులు, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతేడాది కూడా ఇదే తరహాలో వాసన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.