కేసుల విషయంలో స్పెయిన్ ను దాటేసిన ఇండియా... ఇప్పుడిక వరల్డ్ టాప్-5
- 2.44 లక్షలను దాటేసిన ఇండియా కేసులు
- స్వల్పంగా తగ్గిన రికవరీ రేటు
- మొత్తం మరణాల సంఖ్య 6,642కు పెరుగుదల
స్పెయిన్ లో 2,40,978 కేసులుండగా, ఇండియాలో కేసుల సంఖ్య 2.44 లక్షలను దాటేసింది. ఇదే సమయంలో రికవరీ రేటు 48.27 శాతం నుంచి 48.20 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో 294 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 6,642కు చేరింది. కేసుల సంఖ్య విషయంలో శుక్రవారం నాడు ఇటలీని అధిగమించిన భారత్, 24 గంటలు తిరక్కముందే స్పెయిన్ ను దాటేసింది. ఇండియాలో ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.