నాపై తప్పుడు ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా: కేటీఆర్
- కేటీఆర్ ఫాంహౌస్ పై ఫిర్యాదు
- నోటీసు ఇచ్చిన గ్రీన్ ట్రైబ్యునల్
- ఆ భూమి తనది కాదన్న కేటీఆర్
ఒక కాంగ్రెస్ నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆ భూమి తనది కాదని గతంలోనే స్పష్టంగా చెప్పానని అన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలని నిరూపిస్తానని అన్నారు.