తెలంగాణలో ఆపిల్... తొలిపంటను సీఎం కేసీఆర్ కు సమర్పించిన రైతు బాలాజీ
- ప్రతికూల వాతావరణంలో ఆపిల్ సాగు
- ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన రైతు బాలాజీ
- బాలాజీని అభినందించిన సీఎం కేసీఆర్
ప్రకృతి రీత్యా అననుకూల వాతావరణంలో ఆపిల్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించిన రైతు బాలాజీని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. సీసీఎంబీ, వ్యవసాయ శాఖ సలహాలతో ఆపిల్ ను వాణిజ్య పంటగా సాగు చేస్తున్న రైతు బాలాజీ తెలంగాణ రైతాంగానికి కొత్త ఆశలు కల్పిస్తున్నాడు.