సింగరేణి గనుల్లో తీవ్ర విషాదం... భారీ పేలుడుతో ఐదుగురి మృతి
Add ap7am to your home Screen

సింగరేణి గనుల్లో తీవ్ర విషాదం... భారీ పేలుడుతో ఐదుగురి మృతి

Huge explosion in Singareni mines
  • బ్లాస్టింగ్ సందర్భంగా ప్రమాదం
  • ముడిపదార్థాలు నింపుతుండగా విస్ఫోటనం
  • ఛిద్రమైన కార్మికుల శరీరాలు
ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. రాష్ట్రం మొత్తం సంబరాల్లో మునిగితేలుతున్న వేళ సింగరేణి గనుల్లో భారీ పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఓపెన్ కాస్ట్-1 గనిలోని ఫేజ్-2లో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బ్లాస్టింగ్ కు అవసరమైన ముడిపదార్థాలు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి సంఘటన స్థలంలో బీభత్సం నెలకొంది. ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి దేహాలు ఛిద్రం అయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
Singareni
Death
Blasting
Explosion
Telangana

More Telugu News