చైనాతో ఉద్రిక్త పరిస్థితులపై రాజ్నాథ్ సింగ్ స్పందన
- సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం
- మిలిటరీ, దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయి
- అమెరికా రక్షణ శాఖ కార్యదర్శితో మాట్లాడాను
- చైనాతో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పాను
ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను భారత్-చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై రాజ్నాథ్ స్పందిస్తూ.. తాను అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ టీ ఎస్పెర్తో మాట్లాడానని, ఈ సమస్యను చైనాతో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పినట్లు తెలిపారు. చైనాతో గతంలోనూ ఇటువంటి సమస్యలు తలెత్తాయని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగించేందుకు స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని చెప్పారు.