కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్న డాక్టర్, నర్సు... ఫొటోలు వైరల్!
- ఉత్తర ఐర్లాండ్ అమ్మాయి, శ్రీలంక అబ్బాయి మధ్య ప్రేమ
- ఏప్రిల్ లో పెళ్లి
- రెండ్రోజుల కిందట ఫొటోలు షేర్ చేసిన ఆసుపత్రి వర్గాలు
ప్రేమలో పడిన జేన్, నవరత్నం వాస్తవానికి ఆగస్టులో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా సంక్షోభం వీరిని మరింత ముందే పెళ్లి చేసుకునేలా పురిగొల్పింది. ఉత్తర ఐర్లాండ్, శ్రీలంక నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వచ్చేందుకు వీలుకాకపోవడంతో ఈ జోడీ ఏప్రిల్ లో తమ ఆసుపత్రిలోనే ఉన్న చర్చిలో పెళ్లితో ఒక్కటైంది. ఈ పెళ్లిని ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారా వీక్షించారు.
కాగా, ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సెయింట్ థామస్ ఆసుపత్రి వర్గాలు రెండ్రోజుల క్రితమే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం అందరికీ తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
