AP DGP: రాష్ట్రంలో ప్రయాణానికి ఏ విధమైన పాస్ అక్కర్లేదు: ఏపీ డీజీపీ

No Pass Required for Journey in Andhrapradesh
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు పూర్తిగా తొలగిపోయాయి. తమతమ సొంత వాహనాల్లో ప్రజలు జిల్లాలను దాటి వెళ్లవచ్చని, అందుకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులూ అక్కర్లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అంతర్‌ జిల్లాల ప్రయాణానికి అనుమతినిస్తున్నామని, అయితే, కారులో ముగ్గురికి మించరాదని, మాస్క్‌, ఇతర నిబంధనలు వర్తిస్తాయని సీనీయర్ ఐపీఎస్ అధికారులు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో సవాంగ్ స్పష్టం చేశారు.

గత మూడు రోజులుగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు జిల్లాలను దాటి ప్రయాణిస్తూ, ప్రజలను తరలిస్తున్నందుకు, వ్యక్తిగత వాహనాలకు ప్రత్యేక అనుమతుల అవసరంపై ప్రశ్నలు వస్తున్నాయని వ్యాఖ్యానించిన సవాంగ్, ప్రత్యేక పాస్ ‌లు తీసేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద మినహా మరెక్కడా వాహనాలకు పాస్‌ లు అడగవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు. కారును ఎక్కడైనా ఆపి పోలీసులు తనిఖీ చేస్తారని, ఆ సమయంలో అందరికీ విధిగా మాస్క్ ఉండాల్సిందేనని తెలియజేశారు. 
Go Back to Shorts
AP DGP
Gautam Sawang
Journey
Pass

More Telugu News