భారత్ లో ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’... పదిహేను వేల పందుల మృతి!
- చైనా నుంచి వ్యాప్తి చెందిన వైరస్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్
- జంతువుల నుండి జంతువులకే సంక్రమిస్తుంది
- అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో ఈ వైరస్ గుర్తింపు
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుమారు పది జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేసింది. వైరస్ సోకిన పందులను సామూహికంగా చంపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అసోం పశు సంవర్థక శాఖ మంత్రి అతుల్ బోరా చెప్పారు. ఈ వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందిందని, దీంతో దేశీయ పందులకు ప్రాణాంతకమని, దాదాపు వంద శాతం మరణాల రేటు ఉంటుందని అన్నారు.